హైదరాబాద్ – ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమయాత్ర ఈరోజు ఉదయం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. ఎల్బీ స్టేడియం నుండి అంతిమయాత్ర మొదలవుతుంది. గద్దర్ పార్థీవదేహం కళాకారులతో భారీ ర్యాలీగా వెళ్లనుంది. గద్దర్ అంతిమయాత్రలో భారీగా కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు.
ఎల్బీస్టేడియంనుండి బషీర్‌బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు అంతిమయాత్ర సాగనుంది.మొదట గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్థీవదేహాన్ని తీసుకువెడతారు. కాసేపు అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచి పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు.
ఆ తరువాత అమరవీరుల స్థూపం నుండి భూదేవినగర్ లోని గద్దర్ నివాసానికి పార్థివదేహాన్ని తీసుకు వెళ్లనున్నారు. అక్కడ భూదేవినగర్ లోని మహాభారతి విద్యాలయం అవరణలో గద్దర్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంచనాలతో నిర్వ హించనున్నారు.
కాగా, ప్రజా యుద్ధనౌక గద్దర్ కు అధికార లాంఛనాలతో ఖననం చేసేందుకు ఏర్పాట్లు… అల్వాల్ వెంకటాపురం లో గద్దర్ నెలకొల్పిన మహాబోధి పాఠశాలలో ఇట్టి ఏర్పాట్లు చేస్తున్నారు… ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు..