హైదరాబాద్ – తన మాట, పాట, ఆటలతో.. మాటలనే పాటలుగా మలిచి ఉర్రూతలూగించిన ప్రజా యుద్ధనౌక ప్రస్థానం ముగిసిపోయింది. బండెనక బండి కట్టి తరలొచ్చిన ప్రజాగాయకుడి అభిమానలోకం.. వాలిపొతున్న పొద్దుకు విప్లవజోహార్లంటూ కన్నీటి వీడ్కోలు పలికింది. సికింద్రాబాద్ అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయంలో బౌద్ధమత ఆచారం ప్రకారం ప్రజాయుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు.
. కడసారి చూపుకోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. గద్దర్‌కు అత్యంత ఇష్టమైన మహాబోధి పాఠశాలలోనే అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియల్లో అభిమానులు, మంత్రులు, పలు పార్టీల నాయకులు, కళాకారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు