హైదరాబాద్ – ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన విప్లవకారుడు, తెలంగాణ ఫోక్ సింగర్ గద్దర్‌పై నమోదై ఉన్న పోలీసు కేసుల్లో యాక్షన్డ్రాప్చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. వేర్వేరు న్యాయస్థానాల్లో ఆయనపై కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఆయా కోర్టులకు గద్దర్డెత్సర్టిఫికెట్ను సమర్పించాలని నిర్ణయించారు. కెనరా బ్యాంక్ఉద్యోగి అయిన గద్దర్శ్రీకాకుళం ఉద్యమ నేపథ్యంలో విప్లవ బాటలోకి నడిచిన విషయం తెలిసిందే. జననాట్య మండలిని ఏర్పాటు చేయటంలో కీలకపాత్ర పోషించిన ఆయన కొన్నేళ్లపాటు మావోయిస్టులతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో అజ్ఞాతంలో కూడా కాలం గడిపారు. జననాట్య మండలిని మరింత పటిష్ట పరచటంతోపాటు యువతను చైతన్యవంతులను చేయాలన్న లక్ష్యంతో పార్టీ ఆదేశాల మేరకు ఆయన జన జీవన స్రవంతిలోకి వచ్చారు.
కాగా, ఆయన పార్టీలో ఉన్నపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో 20 కేసులు, మహారాష్ర్ట, కర్ణాటకతోపాటు ఇతర రాష్ర్టాల్లో 15 కేసులు నమోదయ్యాయి. గతంలో కర్ణాటక రాష్ర్టంలో మావోయిస్టులు ఓ పోలీస్‌స్టేషన్‌ను పేల్చడానికి కారణం గద్దర్పాటలే అన్న అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో ఎన్ఐఏ ఆయనను అరెస్టు చేయటానికి కూడా ప్రయత్నించింది. ఇలా వేర్వేరు పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల్లో వేర్వేరు న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది
. కాగా, ఆరోగ్య సమస్యలతో ఇటీవల గద్దర్మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ర్ట పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై నమోదైన కేసుల్లో యాక్షన్ డ్రాప్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గద్దర్‌పై నమోదైన కేసుల్లో విచారణ జరుపుతున్న అన్ని న్యాయస్థానాలకు ఆయన డెత్‌సర్టిఫికెట్‌ను సమర్పించాలని నిశ్చయించారు.