Sunday, November 17, 2024

నాలుగు రాష్ట్రాల్లో గద్దర్‌పై కేసులు.. పోలీసుల కీలక నిర్ణయం

హైదరాబాద్ – ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన విప్లవకారుడు, తెలంగాణ ఫోక్ సింగర్ గద్దర్‌పై నమోదై ఉన్న పోలీసు కేసుల్లో యాక్షన్​డ్రాప్​చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. వేర్వేరు న్యాయస్థానాల్లో ఆయనపై కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఆయా కోర్టులకు గద్దర్​డెత్​సర్టిఫికెట్‌ను సమర్పించాలని నిర్ణయించారు. కెనరా బ్యాంక్​ఉద్యోగి అయిన గద్దర్​శ్రీకాకుళం ఉద్యమ నేపథ్యంలో విప్లవ బాటలోకి నడిచిన విషయం తెలిసిందే. జననాట్య మండలిని ఏర్పాటు చేయటంలో కీలకపాత్ర పోషించిన ఆయన కొన్నేళ్లపాటు మావోయిస్టులతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో అజ్ఞాతంలో కూడా కాలం గడిపారు. జననాట్య మండలిని మరింత పటిష్ట పరచటంతోపాటు యువతను చైతన్యవంతులను చేయాలన్న లక్ష్యంతో పార్టీ ఆదేశాల మేరకు ఆయన జన జీవన స్రవంతిలోకి వచ్చారు.

కాగా, ఆయన పార్టీలో ఉన్నపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు పోలీస్​స్టేషన్లలో 20 కేసులు, మహారాష్ర్ట, కర్ణాటకతోపాటు ఇతర రాష్ర్టాల్లో 15 కేసులు నమోదయ్యాయి. గతంలో కర్ణాటక రాష్ర్టంలో మావోయిస్టులు ఓ పోలీస్​స్టేషన్‌ను పేల్చడానికి కారణం గద్దర్​పాటలే అన్న అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో ఎన్ఐఏ ఆయనను అరెస్టు చేయటానికి కూడా ప్రయత్నించింది. ఇలా వేర్వేరు పోలీస్​స్టేషన్లలో నమోదైన కేసుల్లో వేర్వేరు న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది

. కాగా, ఆరోగ్య సమస్యలతో ఇటీవల గద్దర్​మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ర్ట పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై నమోదైన కేసుల్లో యాక్షన్ ​డ్రాప్​ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గద్దర్‌పై నమోదైన కేసుల్లో విచారణ జరుపుతున్న అన్ని న్యాయస్థానాలకు ఆయన డెత్​సర్టిఫికెట్‌ను సమర్పించాలని నిశ్చయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement