Saturday, November 23, 2024

పిహెచ్ డిలో మెరిసిన మారుమూల ఉద్యమకారుడు

హైదరాబాదులో 81వ ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఘనంగా జరిగాయి. వనపర్తి జిల్లా పరిధిలోని చిన్నంబావి మండలం కృష్ణా నది తీర ప్రాంత మారుమూల పెద్ద మారురు గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాసులుకు 81వ ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పిహెచ్ డి (డాక్టరేట్) పట్టాను పొందారు. ఈ పట్టా పురస్కారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో ఇండియన్ డిఆర్డిఓ చైర్మన్ డా జి సతీష్ రెడ్డి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. ముఖ్యంగా ప్రొఫెసర్ జయంత్ చాపల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో రామన్ పాడు డ్యామ్ అనే అంశంపైన సైన్స్ విభాగంలో 6% ప్లగరిజముతో బోటని డిపార్ట్మెంట్లో అలాగల్ బయో డైవర్సిటీ మరియు వాటర్ అనాలసిస్ లో ఉత్తీర్ణత సాధించడం జరిగింది పట్టా అందుకున్న గడ్డం శ్రీను మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన గడ్డం బకమ్మ బాలస్వామి లకు పాదాభివందనాలు తెలియజేశారు అదేవిధంగా తన స్ఫూర్తికి కారణమైన తన జీవిత భాగస్వామి సతీమణి మంజుల (ఎంబీఏ)కు, కుటుంబ సభ్యులకు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కొరకు మలివిడత ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రజాస్వామిక డిమాండ్ల కొరకు ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుకుగా పాల్గొన్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement