హైదరాబాద్, (ప్రభన్యూస్): ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సంబంధిత కోర్సులకు డిమాండ్ బాగాపెరుగుతోంది. దీంతో ఆ సీట్లు హాట్ కేకుల్లా నిండిపోతున్నాయి. ఇంజనీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపుల ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. ఎంసెట్ కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 84,216 కాగా, అందులో ఇంజనీరింగ్ సీట్లు 79,790 సీట్లు, ఫార్మసీలో 4,426 సీట్లు ఉన్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కలిపి 45,062 సీట్లను ఇప్పటికే భర్తీ చేశారు. వీరు ఆయా కళాశాలల్లో జాయిన్ కూడా అయ్యారు.
అయితే మొత్తం సీట్లల్లో భర్తీ కాగా మిగిలిన 39,154 సీట్లకు తుదివిడత కౌన్సెలింగ్‌ను ఇటీవల నిర్వహి్ంచారు. అందులో 15,152 సీట్లను కేటాయించగా ఇంకా 24,002 కన్వీనర్ కోటా సీట్లు మిగిలినట్లు అధికారులు శుక్రవారం ప్రకటిం చారు. సీట్లు పోందిన అభ్యర్థులందరూ ఈనెల 15లోగా ఆన్‌లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. సీట్లు రద్దు చేసుకో వాలనుకునే వారికి ఈనెల 18వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
175 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు మొత్తం 79,790 ఉంటే, అందులో రెండు విడతలు కలిపి మొత్తం 59,993 (75శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 19,797 సీట్లు ఖాళీగా మిగిలాయి. అలాగే ఎంపీసీ స్ట్రీమ్ విద్యా ర్థులకు కేటాయించిన ఫార్మసీ, ఫార్మ్-డి మొత్తం సీట్లు 4426 కాగా, వీటిలో 221 సీట్లను రెండు విడతలల్లో కేటాయించగా, ఇంకా 4205 సీట్లు మిగిలి పోయాయి. దాంతో ఫార్మసీ విద్యకు ఆదరణ కరువైందనే చెప్పాలి. కేవలం 4.99 శాతం మాత్రమే సీట్లు ఫార్మసీ విభాగంలో నిండడం గమనార్హం.
మెకానికల్, ఈఈఈ కోర్సులకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో మెకానికల్‌లో 32.57 శాతం సీట్లు, సివిల్‌లో 41,87 శాతం, ఈఈఈలో 46.14 శాతం, ఈసీఈలో 77.46 శాతం సీట్లను కేటాయించారు. ఇండ స్ట్రీయల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమేషన్- రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఈటీఎం, సీఐటీ, మెటలర్జీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటె క్నాలజీ కోర్సుల్లో ఒక్క సీటు కూడా కేటాయించలేదు. మిగిలిన సీట్లకు మళ్లిd స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily