సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్ర చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే భట్టి పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ప్రకటిస్తామని థాక్రే తెలిపారు. అంతకుముందు గాంధీ భవన్‌లో ఈరోజు జరిగిన హాత్ సే హాత్ జోడో సమీక్షా సమావేశం సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని ఆ పార్టీ నేతలు బడాయిలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తాము కట్టిన కంపెనీల నుంచే విద్యుత్ ఇస్తున్నారని భట్టి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మరాయని సీఎల్పీ నేత విమర్శించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement