Sunday, November 17, 2024

TS: బీఆర్ఎస్ తో దోస్తీ ఖతం.. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి నీలం మధు

-అభివృద్ధి కోసమే అహర్నిశలు శ్రమించా
-అయినా పార్టీ గుర్తించలేదు
-ఇక ప్రజా క్షేత్రంలో నా పోరాటం
-నా ప్రజలే నా అధిష్టానం
-ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్

  • ఎన్నికల సమర శంఖం పూరించిన నీలం మధు ముదిరాజ్
    -జనసంద్రంగా మారిన కొత్తపల్లి గ్రామం
    -అడుగడుగునా నీలం మధు ముదిరాజ్ కు జననీరాజనం

పఠాన్ చేరు, ప్రభ న్యూస్ : ఆది నుంచి అహర్నిశలు పార్టీ కోసమే ఓ సైనికుడిలా కష్టపడి పని చేశానని, అయినా పార్టీ తన సేవలను గుర్తించలేదని ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. సోమవారం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీలం మధు ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే వేదిక నుంచి పాదయాత్రతో ఎన్నికల సమర శంఖం పూరించారు. అశేష సబండవర్గాల ప్రజలు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అభిమానుల సమక్షంలో కార్యాచరణ ప్రకటించారు. నీలం మధు ముదిరాజ్ ప్రకటన చేయబోతున్నాడు అన్న విషయం తెలుసుకున్న ముదిరాజ్ సంఘాల నాయకులు సభ్యులు ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున కొత్తపల్లి గ్రామానికి తండోపతండలుగా తరలివచ్చారు. నీలం మధు ముదిరాజుకు జనం నీరాజనాలు పట్టారు.

అశేష జనవాహిని సాక్షిగా నీలం మధు ముదిరాజ్ ఎన్నికల్లో పోటీకి సయ్యంటూ సమర శంఖం పూరించారు. ఇక వెనక్కి తగ్గేది లేదన్నారు. బహుజన బిడ్డలకు రాజ్యాధికారం వచ్చిన సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుందన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన గుర్తింపు శూన్యమన్నారు. 22 సంవత్సరాల నుంచి పార్టీ అభ్యున్నతికి సైనికుడిలా ముందుండి పని చేసినట్లు వెల్లడించారు. 2014లో పటాన్చెరువు జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయడానికి అభ్యర్థులు లేని సమయంలో తాను ముందుండి నిలిచి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా చిట్కుల్ గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించానన్నారు. ఒక స్థానం తన తల్లి రాధమ్మ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు విశేషంగా పాటుపడినట్లు నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు.

- Advertisement -

సేవా కార్యక్రమాలే కాకుండా పార్టీ సంక్షేమ పథకాలు అభివృద్ధిని సైతం గడపగడపకి తీసుకెళ్లేలా విస్తృత కృషి చేసినట్లు పేర్కొన్నారు. అవసరమైతే తన సొంత ఆస్తులను అమ్మి కార్యక్రమాలను దిగ్విజయంగా విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. అయినా పార్టీ ఏమాత్రం తన సేవలను గుర్తించకపోవడం తనను అత్యంత బాధాకరంగా మార్చిందన్నారు. ఎంతవరకు ఇది సమంజసమని నీలం మధు ముదిరాజ్ ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే లేదా ప్రచారం చేస్తే చూసి ఓర్వలేని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనపై అక్రమంగా కేసులు పెడతామని హెచ్చరించినట్లు తెలిపారు. మరోవైపు ఫ్లెక్సీలు సైతం ధ్వంసం చేసిన సందర్భాలు కూడా ఉన్న సంయమనంతో పార్టీ కోసమే పని చేశానన్నారు.

బహుజన బిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కోసం ఎదురుచూసినా అధిష్టానం కనికరించక పోవడంతోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ప్రజల ఆకాంక్షల మేరకు నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక తెలుసుకోవాల్సిందల్లా ప్రజాక్షేత్రంలోనే అని నమ్మి ఆశేష ప్రజల ఆధారాభిమానాల సాక్షిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. కొత్తపల్లి గ్రామంలో కథనరంగంలోకి దిగిన నీలం మధు ముదిరాజుకు స్థానిక మహిళలు విజయ తిలకం దిద్ది ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సబ్బండ వర్గాల నాయకులు సభ్యులు, ముదిరాజ్ సంఘాల సభ్యులు యువసేన సభ్యులు అశేష ఎన్ఎంఆర్ యువసేన అభిమానులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement