జనగామ జిల్లా : పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్స్ లో ‘ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్’ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిభిరంలో యువతి, యువకులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి & ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధన కోసం కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంలో ఉన్న సంతృప్తి మరి దేనిలో ఉండదని అన్నారు.
తమ తండ్రి కీ శే ఎర్రబెల్లి జగన్నాధ రావు ప్రజాసేవకు నిరంతరం శ్రమించే వారని, ఎమ్మెల్యే కావాలనే ఆశయాన్ని నిరంతరం ప్రజాసేవతో తన కుమారుడిగా తాను నెరవేర్చానని అన్నారు, విద్యార్థులు కూడా ఉద్యోగ సాధనకు దృడ సంకల్పాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా కృషి చేయాలన్నారు, ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన కోచింగ్ సెంటర్ల ద్వారా 350 పై చిలుకు యువతీ యువకులు ఉద్యోగాలు సంపాదించారని, పాలకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువత భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదేనన్నారు, ఈ సందర్భంగా బషారత్ గార్డెన్ (జెడ్పి కోఆప్షన్ మెంబర్ మదార్) యజమాన్యాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.