కరీంనగర్ క్రీడలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ ప్రభుత్వం విద్య , వైద్యంతో పాటు క్రీడలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బాలబాలికలకు ఉచిత వేసవి క్రీడల శిక్షణ శిబిరాన్ని ఆయన ఇవ్వాల ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు వెళ్లేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
గత 5వ్సంవత్సరాలుగా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నగరపాలక సంస్థను అభినందించారు. స్మార్ట్ సిటీ లో భాగంగా స్టేడియం అభివృద్ధి కి అధిక నిధులు కేటాయించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీసు కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్.. నగర మేయర్ సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ తదితరులు పాల్గొన్నారు.