హైదరాబాద్ – రజక, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సెలూన్, లాండ్రీ, ధోబీఘాట్‌లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరని చెప్పారు. ఎవరు అధైర్యపడవద్దని అన్నారు. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక శాఖ బడ్జెట్‌ను విడుదల చేయాలని ఈ మేరకు మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా తప్పకుండా అమలు చేస్తుందని హామినిచ్చారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Saloons – ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తాం …. మంత్రి పొన్నం ప్రభాకర్
Advertisement
తాజా వార్తలు
Advertisement