సేవా దృక్పథంతో నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్స చేస్తున్నట్లు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో అపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి సహకారంతో నియోజకవర్గానికి చెందిన 25 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్రం లో చాలా మంది ప్రజలు అందత్వముతో బాధపడుతున్నారని, గత 30 సంవత్సరాలుగా ఎన్నో ఉచిత కంటి శిబిరాలు, ఉచిత కంటి శస్త్రచికిత్స లు నిర్వహించామని,సేవ దృక్పధం తోనే ఉచిత కంటి శిబిరాలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య మంత్రి సైతం అందత్వ నివారణకు కంటి వెలుగు లాంటి కార్యక్రమం చేపట్టారని,జగిత్యాల జిల్లా ప్రజల కొరకై మెడికల్ కాలేజీ లో నేత్ర వైద్యులను నియమించాలని అసెంబ్లీ లో కోరానన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement