ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు భారత్ vs ఇంగ్లండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు ప్రభుత్వ పాఠశాలలు, సర్కార్ గుర్తింపు గల స్కూల్ విద్యార్థులను ఉచితంగా అనుమతించనున్నారు. మ్యాచ్‌కు విచ్చేసే విద్యార్థులకు హెచ్‌సీఏ ఉచితంగా భోజనం కూడా అందించనుంది.
ఈనెల 18వ తేదీ లోపు హెచ్‌సీఏ సీఈఓకు పాఠశాలల ప్రిన్సిపాల్స్ తమ స్కూల్ నుంచి ఎంత మంది విద్యార్థులు, స్టాప్ వస్తున్నారో తెలిపాలి. జనవరి 18వ తేదీలోపు హెచ్‌సీఏ సీఈవోకు [email protected] కు మెయిల్ చేయాలి. అయిదు రోజుల పాటు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజన సదుపాయం ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ మ్యాచ్‌కు రావొచ్చని వెల్లడించింది.