Wednesday, November 13, 2024

సాలార్‌జంగ్‌ మ్యూజియంలోకి ఫ్రీ ఎంట్రీ..

ఈ నెల 16 నుంచి వారం రోజుల పాటు అంటే 21 వ‌ర‌కు ఎలాంటి ఎంట్రీ షీజ్ లేకుండా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్‌ నాగేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 18న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందని, ఇందులో భాగంగా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోనే వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 16-21వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలను జరుగుతాయని, ఈ సందర్భంగా సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యూజియం తెరిచే ఉంటుందని, కుటుంబ సమేతంగా తరలివచ్చి కార్యక్రమాలను వీక్షించాలని కోరారు. మ్యూజియంలో లైటింగ్‌, వాతావరణం సందర్శకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. భారత స్వాతంత్య్రాన్ని సూచించే 75 వస్తువులతో ప్రదర్శన ఉంటుందని, బిద్రి తయారీపై ఒక రోజు వర్క్‌షాప్‌, ఉపన్యాసం ఉంటుందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement