హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహేశ్వరం నియోజకవర్గంలో ఇంటింటికీ ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని ఈ రోజు (గురువారం) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. సీమెన్స్ హెల్దినీర్స్ సహకారంతో రీచింగ్ ఔట్ విత్ ఇన్నోవేటివ్ సర్వీసెస్ ఫర్ ఐ కేర్ (రైజ్) ప్రాజెక్టు కింద ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ చేపట్టింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా మహేశ్వరం మండలంలో 50 వేల మందికి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. కంటి సమస్యలు తీవ్రంగా ఉన్నవారికి మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు పంపిస్తారు.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.