Saturday, October 5, 2024

Fourth Day ….. నేడు నానే బియ్యం బతుకమ్మ వేడుకలు ..

తెలంగాణలో కొన‌సాగుతున్న బ‌తుక‌మ్మ సంబ‌రాలు
నాలుగు రోజున నానే బియ్యం బ‌తుక‌మ్మ‌గా ఆటాపాట‌
బియ్యంతో చేసిన ప‌దార్ధాల‌తో అమ్మ‌కు నైవేద్యం

హైద‌రాబాద్ – తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే బతుమ్మ పండుగ నాలుగో రోజు వచ్చేసింది.
నాలుగో రోజు బతుకమ్మ ‘నానేబియ్యం బతుకమ్మ’. ఈరోజు గౌరమ్మను తయారు చేసి, తంగేడును రకరకాల పూలతో అలంకరించి, వాయనంగా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చెక్కరతోకలిపి ముద్దలు చేసి పెడతారు. ఇది నాల్గవ రోజు నానేబియ్యం బతుకమ్మ ప్రత్యేకత.

- Advertisement -

ప్ర‌తి నివేద‌న వెనుక ఒక ప‌రమార్ధం..

పండుగ సందర్భంగా సమర్పించే ప్రతి నివేదనలో ఒక అర్థం ఉంటుంది. బతుకమ్మ ఆడిన తర్వాత అందరికీ ప్రసాదం పంపిణీ చేస్తారు. ప్రసాదం అంటే పదిమందికి పంచడం. రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడి ఆకలితో జగన్మాత అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానబెట్టిన బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తారు. బియ్యాన్ని కడిగి నానబెట్టి ఎండబెట్టి మెత్తని పిండిలా తయారుచేస్తారు. అందులో పాలు, పంచదార, నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలు అని అంటారు. ఈ పచ్చిపిండి ముద్దులు అంటే అమ్మకు ఎంతో ఇష్టం. అందుకే నానబెట్టిన బియ్యంతో చేసిన వస్తువులను అమ్మకు సమర్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement