ఇందల్ వాయి అక్టోబర్ 14 ప్రభ న్యూస్ – నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి గ్రామం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉత్తర ప్రదేశ్ వాసులు మృతి చెందారనీ డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. సిఐ కృష్ణ. ప్రత్యక్ష సాక్షులు. స్థానికుల వివరాల ప్రకారం ప్రమాద వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి సుమారు 150 మంది ప్రయాణికులతో UP-43 AT 5069 నంబరు గల బస్సు యూపీ కి బయలుదేరిందన్నారు అర్థరాత్రి ప్రాంతంలో చంద్రాయంపల్లి వద్దకు చేరుకోగానే రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపి ఉన్న లారీని ఢీ కొట్టిందన్నారు. లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసం కాగా డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయని వివరించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి నుండి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా పోలీసులు. టోల్ ప్లాజా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని హెచ్చరిక బోర్డులు పెట్టి ట్రాఫిక్ ని నియంత్రించారనీ వివరించారు.
అంతలోనే బస్సు దిగిన ప్రదీప్ (40), గనేష్ (29),,జీతు(32),దుర్గేష్ ప్రసాద్ బస్సు పక్కన నిలుచుని ఉండగా వెనుక నుండి నిర్లక్ష్యంగా వేగంగా వచ్చిన డీసీఎం వ్యాను వీరిని ఢీ కొట్టిందనీ.. దీంతో ప్రదీప్ తో పాటు జీతు ఘటనా స్థలంలోనే శరీరాలు ఛిద్రమై మృతిచెందగా.. గనేష్ తో పాటు .దుర్గేష్ ప్రసాదులు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారనీ ఎస్ ఐ మహేష్ తెలిపారు. ఘటనపై ప్రదీప్ సోదరుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యానును. బస్సులను స్టేషన్ కి తరలించమన్నారు. డీసీఎం డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ మహేశ్ తెలిపారు..