Friday, September 20, 2024

TG: ఇంకా నాలుగేళ్లు… ఈ ఖ‌ర్మ త‌ప్ప‌దు… కేటీఆర్

మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నాలుగేళ్ళు ఈ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని… ప్రజలకు ఇక వేరే మార్గం లేదని, ఈ ఖ‌ర్మ త‌ప్ప‌ద‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. బడ్జెట్‌పై తమను ప్రతిపక్షం అభినందిస్తుందని భావించానని భట్టివిక్రమార్క అన్నారని… కానీ ఏం చూసి అభినందించాలో చెప్పాలన్నారు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పినందుకు అభినందించాలా ? డిక్లరేషన్‌లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా ? 420 హామీలను తుంగలో తొక్కినందుకు అభినందించాలా ? అభినందించడం కాదు అధ్యక్షా… అభిశంసించాలి. మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి ప్రజల మిమ్మల్ని నాలుగేళ్లు భరించాల్సిందే అన్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement