రాష్ట్ర హైకోర్టు నూతన భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హైకోర్టును నిర్మించనున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
- Advertisement -
లోక్సభ ఎలక్షన్ కోడ్ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకావడం లేదు. సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ సహా పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా అటెండ్ అవుతున్నారు.