హైదరాబాద్ | ఫార్ములా ఈ-రేసు వ్యవహరంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట అడ్వొకేట్ రాంచందర్ రావు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు.
ఈ మేరకు ప్రత్యేక గదిలో ముగ్గురు అధికారుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. అందులో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఏఎస్పీ నరేందర్, మరో డీఎస్పీ మాజీద్ ఖాన్ కలిసి కేటీఆర్‌కు ప్రశ్నలు అడుగుతున్నారు. మొత్తం విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -