ఫార్ములా ఈ కార్ రేసు కేసులో పరిణామాలు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇవాళ బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంఏ అండ్ యూడీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఫార్ములా ఈ-రేసు అగ్రిమెంట్ సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయనున్నారు.
మరోవైపు ఇదే కేసులో మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని ఈడీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే ఆయన ఈడీ అధికారుల ఎదుట ఫార్ములా ఈ- రేసుకు సంబంధించి కీలక పత్రాలతో విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసు 2 అగ్రిమెంట్ సమయంలో డబ్బు బదిలీలో బీఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు.