Thursday, January 9, 2025

Formula e-Car Race – నేడు ఎసిబి ముందుకు ఒకరు, ఈడీ విచారణకు ఇంకొకరు

హైదరాబాద్ – ఫార్ములా ఈ-కారు రేసుbకేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి.

ఇక, ఈ కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఐఏఎస్‌ అధికారి అరవింద్ కుమార్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు.

ఫార్ములా ఈ-కారు రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ, ఈడీ స్పీడ్‌ పెంచింది. ఈ కేసులో నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరుకానున్నారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్‌ను విచారణ చేసి ఆయన స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డ్‌ చేయనున్నారు.

- Advertisement -

మరోవైపు, ఇదే కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసులో కేటీఆర్‌.. రేపు ఏసీబీ విచారణను వెళ్లనున్నారు. అలాగే, ఈనెల 16వ తేదీన కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరుకానున్నట్టు తెలిపారు.

మరోవైపు.. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్

క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement