Wednesday, November 20, 2024

నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మ‌ధుసూద‌నాచారి

గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వంపై ఎట్ట‌కేల‌కు స‌స్పెన్ష‌న్ వీడింది.. తెలంగాణ మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి తాజాగా నామినేటెడ్ ఎమ్మెల్సీ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రభుత్వం మధుసూదనాచారి పేరును పంపింది. ప్రభుత్వం పంపించిన పేరును గవర్నర్ ఆమోదించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. గతంలో గవర్నర్ కోటా కింద పాడి కౌషిక్ రెడ్డి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ తమిళి సై తిరస్కరించారు.

దీంతో పాడి కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించగా… మధుసూదనాచారి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సీనియర్ నేత సిరికొండ మధుసూదనాచారి ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటున్నారు. తెలంగాణ తొలి సభాపతిగా మధుసూదనాచారి పనిచేశారు. 2014 ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా.. 2019 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ నేత.. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌ను ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌రించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement