Tuesday, November 26, 2024

బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యమ నేత

తెలంగాణ ఉద్య‌మ కారుడు, TSPSC మాజీ సభ్యుడు  విఠల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్య‌వ‌హారాల ఇన్ చార్జ్‌ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ విఠల్ ను పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సిద్దాంతాలు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ని తీరు న‌చ్చే ఆ పార్టీ లో చేరుతున్న‌ట్లు విఠ‌ల్ చెప్పారు.

కాగా, తెలంగాణ విఠల్‌గా అందరికీ సుపరిచితుడైన విఠల్.. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, కో-చైర్మన్‌గా కీలక పాత్ర పోషించారు. సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ప్రొఫెసర్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి పని చేశారు. 24 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విఠల్ టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగానూ పనిచేశారు. ఆయన పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement