Friday, November 22, 2024

TS: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత… రేవంత్ , కె సి ఆర్ సంతాపం

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాథోడ్ రమేష్ శనివారం కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఉట్నూరులోని తన నివాస గృహంలో రక్తపోటు నిల్వలు పడిపోయి స్పృహ తప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం ఆదిలాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రైవేట్ గజానంద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మార్గమధ్యంలోనే కోమాకు వెళ్లి చివరి శ్వాస విడిచారు. రమేష్ రాథోడ్ కొంతకాలంగా అధిక రక్తపోటు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఢిల్లీలో ఇటీవలే చికిత్స పొంది వచ్చారు.

తిరుగులేని నేతగా ఎదిగిన రాథోడ్…

- Advertisement -

షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. అతను 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. 2006-2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2009లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జూన్ 2021లో ఈటెల రాజేందర్తోపాటు బీజేపీలో చేరారు. ఆయనకు ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ తో సహా పలువురు ప్రగాఢ సంతాపం తెలిపారు.

రేవంత్ సంతాపం..

 ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రమేశ్‌ రాథోడ్‌తో ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

కెసిఆర్ సంతాపం ..

 ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రమేశ్‌ రాథోడ్‌తో ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement