శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆరెస్ట్
ప్రజాభవన్ వద్ద హిట్ అండ్ రన్ కేసు
ప్రమాదం జరిగిన వెంటనే దుబాయ్ కు పరార్
హైదరాబాద్ – ప్రజా భవన్ దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న, బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం తర్వాత దుబాయ్‌కి పారిపోయిన రహీల్ ఇవాళ తిరిగి హైదరాబాద్ రాగా.. ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రహేల్ అరెస్ట్ తర్వాత నేటి ఉదయం జడ్జి ముందు హాజరుపరిచారు. ఈనెల 22 వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం రహేల్‌ను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.