వికారాబాద్, జనవరి 10 (ఆంధ్రప్రభ): ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమని మెతుకు ఆనంద్ అన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో గల శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన ప్రతి మనిషి దైనందిత జీవితంలో ఆధ్యాత్మిక చింతనను అలవరుచుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో జీవితంలో సన్మార్గంలో నడవడంతో పాటు సవాళ్ళని ఎదుర్కొని, ఒత్తిడిని అధిగమించడానికి, మానసికంగా, ప్రశాంతంగా ఉండటానికి మనకు ఆధ్యాత్మిక చింతన ఎంతగానో అవసరమని తెలిపారు. ఆ విష్ణుమూర్తి దయతో వికారాబాద్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి,గోపాల్ రామస్వామినూలి కిరణ్ పటేల్, సీనియర్ నాయకులు వేణు గోపాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు బూరుగుపల్లి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాండు, నాయకులు గంగారం వెంకట్, మల్లేశం, గాండ్ల మల్లికార్జున్, బాబు నాయక్, అనంతయ్య, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు గయాజ్, నాయకులు మదన్‌పల్లి అశోక్, పులుసు మామిడి మహిపాల్ రెడ్డి, నారాయణపూర్ శ్రీనివాస్ గౌడ్, హన్మంత్ రెడ్డి, మహిపాల్ నాయక్, దారూర్ మండల యువజన విభాగం అధ్యక్షులు జైపాల్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, ఎన్కే పల్లి ప్రవీణ్ కుమార్, మర్పల్లి జైపాల్, శివరాం నగర్ కిషోర్, సోను రాథోడ్, సిద్ధూ్లూర్ శ్రీనివాస్, రాజు నాయక్, వెంకటాపూర్ తండా శీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.