ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖాత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
రెండు రోజుల క్రితం కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. అంతేకాదు.. కవితతో కేసీఆర్, కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడుతున్నారు. కవిత యోగ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయిన కవిత తీహార్ జైలులో ఉంటున్నారు.
కోర్టు అనుమతితో జైలులో ఎన్నో పుస్తకాలు చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతోంది కవిత. మద్యం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఇదిలా వుంటే, తీహార్ జైలులో ఉన్న కవితను ఆమె భర్త అనిల్ వారానికి రెండుసార్లు కలుస్తున్నారు.