ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్, జూన్ 8: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం పట్ల మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి సంతాపం ప్రకటించారు. రామోజీరావు పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా అందించిన సేవలను మల్లారెడ్డి స్మరించుకున్నారు.
తెలుగు సమాజానికి రామోజీరావు మృతి తీరనిలోటని, ప్రజా పక్షపాతిగా, జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీ నేటి తరానికి మార్గదర్శి అని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానన్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు మల్లారెడ్డి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
- Advertisement -