Thursday, January 2, 2025

ADB | సీఆర్టీలకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి జోగు రామన్న

ఉట్నూర్, డిసెంబర్ 30 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు ఉమ్మడి జిల్లాలోని సీఆర్టీలు తమను రెగ్యులరైజ్ చేయాలని పలు డిమాండ్లతో చేపడుతున్న నిరవధిక సమ్మె శిబిరానికి సోమవారం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న దీక్ష శిబిరానికి వెళ్లి సీఆర్టీలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీల‌ సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా నెల రోజుల్లోనే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసంచేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు.

ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్ల‌ను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఆర్టీలను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన మాట ఎటుపోయిందని, అబద్దాల‌ హామీలిచ్చి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ ఎంపీపీ పంద్రా జైవంత్ రావు, బీఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ సలీమోద్దీన్, బీఆర్ఎస్ నాయకులు కేంద్రే రమేష్, ఆత్రం వెంకటేష్, మహేందర్, బాబా శ్యామ్ టైగర్, సొనే రావు, సత్తన్న, ప్రజాసంఘాల ఇతర సంఘాల దినేష్, శ్రీకాంత్, నేతవత్ రాందాస్, సాజిద్, పొన్నం సాయి కుమార్, సయ్యద్ ఖాసీం పాల్గొని మద్దతు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement