Wednesday, November 20, 2024

ముంపు ముప్పులో అటవీ గ్రామాలు.. అత్యవసర వైద్యం కోసం త‌ప్ప‌ని పడవ ప్రయాణం

వాజేడు ( ప్రభ న్యూస్): ములుగు జిల్లాలోని అట‌వీ ప్రాంత మారుమూల మండ‌లం, గోదావ‌రి తీర ప్రాంతం అయిన వాజేడులో క్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అత్యవసర వైద్య సేవల కోసం పడవ ప్రయాణం తప్పడం లేదు. అయితే.. గోదావరి వరదల కారణంగా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి నీట మునగడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ 25 గ్రామాల్లో ఒకటైన కృష్ణాపురం గ్రామానికి చెందిన జవ్వ సునీత 9 నెలల గర్భవతి. ఆమెకు పురిటి నొప్పులు రావ‌డంతో ముందస్తు జాగ్రత్తగా వాజేడు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నాటుపడవ సహాయంతో వాజేడు తహ‌సీల్దార్ లక్ష్మణ్, పేరూరు ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో సునీతతోపాటు మలేరియా జ్వరంతో బాధపడుతున్న కృష్ణాపురం గ్రామానికి చెందిన లొడిగా భువనేశ్వరిని తరలించారు. వీరిని ఆస్ప‌త్రికి తరలించడంలో స్టాఫ్​ నర్సు లక్ష్మి కీలకపాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement