Monday, November 18, 2024

పెట్రేగిన ఫారెస్ట్ అధికారులు.. చూస్తుండగానే ఎడ్ల బండికి నిప్పు

ఏజెన్సీ ప్రాంతంలో బ్రతికే ఆదివాసులు ఎక్కువగా అడవితో మమేకమై ఉంటారు. అలాంటి వారికి జీవనోపాధి కూడా తక్కువగానే ఉంటుంది. తను కుటుంబాన్ని పోషించే ఎడ్ల బండి నేడు ఫారెస్ట్ దాడులకు అహుతి అయిన సంఘటన ఎర్రవరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్ళితే మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని ఎర్రవరం గ్రామ చెందిన దనుసరి సమ్మయ్య, తండ్రి పగడయ్య ఇంటి అవసరం కోసం పది కర్రలను ఎడ్ల బండిపై తీసుకెళ్తుండగా.. పెద్దచెరువు సమీపంలో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. సమ్మయ్య ఎంత బ్రతిమిలాడిన వినకుండా అతని ఎద్దులను వదిలి వేసి బండిని కర్కాషంగా,నిర్దాక్షిణ్యంగా కాల్చి వేశారు. ఉన్న ఒక్క ఎడ్లబండిని అగ్నికి ఆహుతి చేశారని బాధితుడు సమ్మయ్య విలపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement