Saturday, November 23, 2024

Forest: ఈసారి సీజ‌న్ కంటే ముందుగానే తునికాకు సేకరణ.. డిసైడ్‌ చేసిన ఫారెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న తునికాకు సేకరణ సీజన్‌ను ముందుస్తుగా మొదలు పెట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. వచ్చే సీజన్‌ తునికాకు సేకరణ ఏర్పాట్లపై బీడీ లీఫ్‌ అసోసియేషన్‌ సభ్యులతో అటవీశాఖ ఉన్నతాధి కారులు అరణ్య భవన్‌లో సమావేశమయ్యారు. అడవిని కాపాడటం, అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా ప్రస్తుత సీజన్‌ను నవంబర్‌ నెల నుంచే మొదలు పెడుతున్న ట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌. శోభ తెలిపారు.

ఈసారి 242 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఆన్‌లైన్‌లో వేలం ద్వారా యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. వేసవి ప్రారంభం నుంచి అగ్ని ప్రమా దాలను నివారించటంలో భాగంగా రక్షిత అటవీ ప్రాంతాల్లో తునికాకు సేకర ణ చేసే కాంట్రాక్టర్లు ఫైర్‌ వాచర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు.

ఈ సమా వేశంలో పీసీసీఎఫ్‌ ఆర్‌. శోభ, అదనపు పీసీసీఎఫ్‌లు సిద్దానంద్‌ కుక్రేటి, ఏ.కే. సిన్హా, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌, అదిలాబాద్‌, వరంగల్‌ సర్కళ్ల చీఫ్‌ కన్జర్వేటర్లు రామలింగం, ఆశ, బీడీ లీప్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement