భద్రాచలం వద్ద గోదావరి ఇవ్వాల (శనివావారం) సాయంత్రానికి మరింత ఉధృతంగా ప్రవాహిస్తోంది. ఉదయం 7 గంటల వరకు 54 అడుగులు ఉండగా.. సాయంత్రం 4 గంటల వరకు 55.40 అడుగులకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జిల్లా యంత్రాంగం కొనసాగిస్తోంది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో 53.1 అడుగులుగా నమోదయింది. 15.59లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
వర్ధన్ పంపుతో భద్రాచలం పట్టణంలోని 430 పైగా కుటుంబాల నుంచి 1300 పైగా వ్యక్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి మరింత పెరిగి అరవై అడుగులకు చేరే అవకాశం ఉన్నందువల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.