ఢిల్లీలో లగచర్ల బాధితులు…
హస్తిన వేదికగా న్యాయ పోరాటం కోసం
జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్,
జాతీయ మానవహక్కుల కమిషన్ తో రేపు భేటి
తమకు జరిగిన అన్యాయంపై మొరపెట్టుకోనున్న గిరిజనం
హైదరాబాద్ – కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని అంత సులువుగా వదిలేలాగా కనిపించడం లేదు కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు. తాజాగా కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవహక్కుల కమిషన్ ను కలిసి రేవంత్ ప్రభుత్వం, పొలీస్ లపై ఫిర్యాదు చేయనున్నారు లగచర్ల కుటుంబ సభ్యులు. ఈ మేరకు తాజాగా కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. వారితో పాటు బిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఉన్నారు.
కాగా, కొడంగల్‌లోని లగచర్లలో ఇటీవల భూముల సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం దాడికి గల కారుకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు పెట్టింది. అందులో పురుషులతో పాటు మహిళలు సైతం ఉన్నారు.వీరంతా గిరిజనులు కావడం గమనార్హం.