Monday, November 18, 2024

TG: మార్పు కోసం.. అధికారంలోకి వ‌చ్చాం.. మంత్రి పొంగులేటి

ఇందిర‌మ్మ రాజ్యంలో అంద‌రికి సంక్షేమ ఫ‌లాలు అందిస్తాం
భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నాం
రైతుల‌కు శాశ్వ‌త పట్టా పాస్ పుస్త‌కాలు
ధ‌ర‌ణి లోపాల‌ను స‌రిచేస్తున్నాం
వివ‌రాలు వెల్ల‌డించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

న‌ల్గొండ -మార్పు కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం తాము అధికారంలోకి వచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిర‌మ్మ రాజ్యంలో జ‌రుగుతున్న మార్పుల ప్ర‌తిఫ‌లాలు అంద‌రికీ అంద‌జేయ‌డ‌మే త‌మ ధ్యేయ‌మ‌ని అన్నారు.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి -సాగర్ మండలం, నెల్లికల్ లో ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన ఫైలెట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సీఏల్పి నేత జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి నేడు స్వయంగా పరిశీలించారు.

అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతన్నకు భూమి విషయంలో ఎటువంటి భయం లేకుండా చేస్తామని, దీనిలో భాగంగా యాచారం, తిరుమలగిరి మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. వాటి పరిష్కారంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతన్నకు భూమి విషయంలో భయం లేకుండా చేస్తామన్నారు.

- Advertisement -

ధ‌ర‌ణితో బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో తిప్ప‌లు..

ధరణి పోర్టల్ తో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటలు ఆడిందన్నారు. ఇప్పుడు 2020చట్టాన్ని సవరణ చేస్తూ.. ప్రజలకు అనువైన ఆర్.ఓ.ఆర్ చట్టం అమలు చేస్తామన్నారు. ఈ చట్టాల విషయంలో ప్రతిపక్ష పార్టీల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం ఉన్న భూమి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో భూమి లేకున్నా పాస్ పుస్తకాలు సృష్టించి రైతుబంధు పొందారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతులకు లబ్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు ప్రభుత్వ భూములు పంచుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement