Monday, November 25, 2024

Followup – ఏజెన్సీలో మావోల అలజడి…. గిరిజనులపై గొడ్డలి వేటు

ఇన్ ఫార్మర్ నెపంతో గొడ్డలితో నరికి చంపిన వైనం…. పలుమార్లు హెచ్చరించిన మారని తీరు అంటూ లేక విడుదల……. మృతుల్లో పేరూరు పంచాయతీ కార్యదర్శి రమేష్…..

వాజేడు నవంబర్ 22 ఆంధ్రప్రభ : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీ లో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీసుల ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో ఒకరైన ఉయిక రమేష్(32) పేరూరు పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఉయిక అర్జున్(38 )అనే గిరిజన వ్యక్తిని సుమారు రాత్రి 11.30 నిమిషాల సమయంలో సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇద్దరినీ ఒకే సమయంలో గొడ్డలితో నరికి చంపారు.

ఉయిక అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

మావోయిస్టుల ఘాతకం తో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది గతంలో ఎప్పుడో 38 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు తప్ప కని విని ఎరుగని రీతిలో వాజేడు మండల కేంద్రంలో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు హతమార్చడంతో ఏజెన్సీ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

- Advertisement -

గత కొద్ది రోజుల క్రితం నుంచి రెక్కి నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

. పలుమార్లు హెచ్చరించిన మార్పు రాలేదు :

ఈ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలను పోలీసులకు చేరవేస్తూ మావోయిస్టులపై దాడులకు కారకులు అయ్యారని పలుమార్లు హెచ్చరించిన పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చడం జరిగిందని వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖ లో పేర్కొన్నారు.ఆ లేఖను సంఘటన స్థలంలో వదిలి వెళ్లారు.

. ప్రాధేయపడిన వదిలిపెట్టలేదు :

వదిలిపెట్టమని ఉయిక రమేష్ భార్య రాంబాయి ఉయిక అర్జున్ భార్య సావిత్రి హతమార్చడానికి వచ్చిన మావోయిస్టులను పాదయ పడిన వదిలిపెట్టకుండా వారిని పక్కకు నెట్టేసి గొడ్డలితో అతికిరాతనంగా తలపై మోది హతమార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పు చేయకపోయినా మావోయిస్టులు ఇంతటి ఘాతకానికి పాల్పడడంతో మా కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

మృతి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ఘటనతో పెనుగోలు కాలనీ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement