Friday, November 22, 2024

Follow up – విద్యాభివృద్ధి తో సిరిసిల్లాని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతా…మంత్రి కేటీఆర్

సిరిసిల్లా – ఆరు రోజుల క్రితం వేణుగోపాల స్వామి గుడి నిర్మించుకొని ఇప్పుడు 8 కోట్లకు పైగా వెచ్చించి అందరూ ఈర్ష పడేలా బ‌డిని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.నిర్మాణాన్ని అధ్భుతంగా అందించిన చక్కటి పాటశాల నిర్మించిన కూలీలకు,నిర్మాణ దారులకు దన్యవాదాలు తెలిపారు. మ‌న ఊరు – మ‌న బ‌డి ప‌థ‌కంలో భాగంగా ఎల్లారెడ్డిపేట‌లో నిర్మించిన పాఠ‌శాల భ‌వ‌నాన్ని కెటిఆర్ ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, విద్యాభివృద్ధి తో సిరిసిల్ల నియోజక వర్గాన్నీ దేశంలోనే ఆదర్శంగా నిలుపుతామ‌న్నారు..విద్యతోనే వికాసం ,పాటశాల తరగతి గదులు భారత దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలుగా మంత్రి పేర్కొన్నారు. విద్యతోనే విజ్ఞానం వస్తుందని అన్నారు. మారుమూల ముస్తాబడ్ మండలంలోని కొండా పూర్ గ్రామ విద్యార్థులు విప్రో లో,ఇన్ఫోసిస్ కంపెనీలలో పనిచేసే స్థాయిని తెలంగాణ విద్యార్థులు ఎదుగడం ఆ హర్షణీయం అని అన్నారు.

వ్యవస్థలో లోపాలు వెతకడం కాద‌ని, జరిగిన అభివృద్ధిని గుర్తించాలి అని అన్నారు. నాడు ఎల్లారెడ్డి పేట బడి ఎలా వుండే ఇప్పుడు ఎలా వుందని ప్రశ్నించారు. 9 ఏళ్ల క్రితం రాష్ట్రం లో వున్న పరిస్థితి నేటి అభివృద్ధి ఎలా వుంది అని గుర్తించాలి అని అన్నారు .9 ఏళ్ల క్రితం ప్రభుత్వం అధికారం వచ్చాక 3 వేల 4 వందల తండాలు గ్రామ పంచాయతీలు అయ్యాయని అంటూ, ,పెన్షన్లు పెంచడం,కరెంట్ ,విద్యుత్, రైతుల సమస్యలు తీర్చిన ఘనత ప్రభుత్వం దే అని అన్నారు. ప్రభుత్వం ప్రతి పైసా ఆలోచన చేసి ఖ‌ర్చుచేస్తూ చిత్త శుద్ది తో పనిచేస్తుందని అన్నారు .ప్రజలకు అవసరమయిన అభివృద్ధి పనులను ప్రభుత్వం తప్పకుండా చేస్తుందంటూ , 9 ఏళ్ళల్లో 60 ఏళ్లలో చేయని అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణే ప్రభుత్వం దే అని అన్నారు.

ఎవడో ఎదో చెప్పాడని ప్రజలు ఆగమాగం కావద్దని ఆలోచనతో మేల‌గాలని అన్నారు. ఎంపి బండి సంజయ్ ఎంపి గా ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఎంపి బండి సంజయ్ కేంద్రంలోని ప్రభుత్వంతో పోరాడి తెలంగాణ‌కు అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే అప్పుడు ఆయ‌ను త‌ప్ప‌కుండా అభినందిస్తున్నాన‌ని అని అన్నారు. తాను ప్రజాస్వామిక నాయకుడిని అయ్యాయని , తప్పకుండా ప్రజల ఆశీస్సులు వున్నానని రోజులు ప్రజలకు సేవచేస్తునే వుంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. తాను ఎక్కడికి పొనని సిరిసిల్ల నుండి నాయకుడిగా వుంటానని అన్నారు. విద్య,వైద్యం,వ్యవసాయం,త్రాగు నీరు,సాగు నీరు తోపాటు అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ది చేశామన్నారు. అన్ని గ్రామాలలో జిల్లాలోని మన ఊరు మన బడి కార్యక్రమ ద్వారా పాఠశాలలు నిర్మిస్తామని అన్నారు. చిన్ననాటి నుండే విద్యార్థులకు కంప్యూటర్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని 25 వేల పాఠ‌ళాలకు బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తామ‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement