తాండూరు, ప్రభన్యూస్: వికారాబాద్ జిల్లాలోని తాండూరు మొత్తం మంచు మయమైంది. శుక్రవారం తెల్లవారు జామున కురిసన మంచు పట్టణమొత్తాన్ని కమ్మేసింది. దాదాపు గంటకు పైగా మంచు దుప్పటిలా పరుచుకుంది. పట్టణంలోని కాలనీలు, వీధులలో మంచు నిండుకుపోయింది. దట్టంగా కురిసిన మంచు వల్ల లారీలు, బస్సలు లాంటి పెద్ద వాహనాలతో పాటు బైకులు, స్కూటీలు నడిపే వాహదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
పట్టణంలోని ప్రధాన రహదారులు అయిన కొడంగల్, చించొల్లి రోడ్డు, విలియమూన్ – అంతారం, హైదరాబాద్ రోడ్డు పూర్తిగా పొగ మంచుతో కమ్ముకుపోయాయి. ఎదురుగా ఏ వాహనాలు వస్తున్నాయో కూడ తెలియకుండా పోయింది. ఆయా వాహనదారులు వెలుగులోనే లైట్లను వేసుకుని ప్రయాణించడం కనిపించింది. మరోవైపు పట్టణంలోని వీధుల్లో ప్రజలు కురుస్తున్న మంచుతో ఆహ్లాదంగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు. దట్టమైన మంచులో సెల్ ఫోన్లతో సెల్పీలు తీసుకుని సందడి చేశారు.