Tuesday, November 26, 2024

ప్రజారోగ్యం, అభివృద్ధిపై దృష్టి సారించాలి – ఎమ్మెల్యే దాసరి

ప్రజల ఆరోగ్యంతో పాటు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే దాసరి హాజరై మాట్లాడారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే గ్రామాల్లో అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా మార్చాలని, ప్లాస్టిక్‌, గాజు సీసాలు, ఇనుప ముక్కలు ఇంట్లో నుంచి బయట వేయకుండా పంచాయతీ సిబ్బందికి అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఇంట్లో పండ్ల మొక్కలు పెంచాలని, మొక్కలను అందజేయనున్నట్లు తెలిపారు. ఎస్సారెస్పీ మైనర్‌ సబ్‌ మైనర్స్‌ ఫీల్డ్‌ చానల్స్‌లో పిచ్చి మొక్కల్ని పూడిక తీతతో ఈజీఎస్‌ కూలీల ద్వారా తొలగించాలన్నారు. రైతులు ఆయిల్‌ ఫామ్‌, మామిడి, అరటి, బొప్పాయి సాగును ఎంచుకోవాలని, ఉద్యానవన శాఖ సబ్సిడీపై అందిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్‌, వైస్‌ ఎంపీపీ మొగురం రమేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ కొంజర్ల వెంకటయ్య, ఎంపీటీసీలు దండే వెంకటేశ్వర్లు, అమరగాని మమత, శ్రీనివాస్‌, సర్పంచులు నరసింహయాదవ్‌, సంతోష్‌ రావు, రాజయ్య, పద్మ, శకుంతల, మహంకాళి తిరుపతి, కో ఆప్షన్‌ లాల్‌ మొహ్మద్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో వేణుగోపాలరావు, అధికారులు అనిల్‌ కుమార్‌, సతీష్‌, ఏఈ సువిశాల, అశోక్‌, ఏపిఎం తులసి మాత, డాక్టర్‌ హుమాయూన్‌, అజారుద్దీన్‌, హార్టికల్చర్‌ జ్యోతిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement