Tuesday, November 26, 2024

Floods – గోదావరికి వరద పోటు – భద్రాచలం వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న నీటి మట్టం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – భద్రాచలం కొత్తగూడెం: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి స్వల్పంగా వరద పెరిగింది. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద 24 అడుగుల వద్ద చేరుకొని ఉంది..

ఇది మరి కొంత పెరిగే అవకాశం కనబడుతుంది.మరోవైపున తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకి భారీ ఎత్తున నీళ్లు రావడంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు నీటి సామర్థ్యం 407 అడుగులు కాగా వరద ప్రభావం పెరుగు తుండటంతో ప్రస్తుతం 43 అడుగులకి చేరింది .దీంతో గత రాత్రి కిన్నెరసాని గేట్లని ఎత్తారు అదేవిధంగా తాలి పేరు ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయి నీటిమట్టం రావటంతో 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి విడుదల చేశారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement