Sunday, November 17, 2024

అలంపల్లి-గిరిగిట్ పల్లి పల్లి మధ్య పొంగి ప్రవహిస్తున్న వరదనీరు

వికారాబాద్, జులై 21 ( ప్రభ న్యూస్): శుక్రవారం తెల్లవారుజాము నుండి తిరిగి భారీ వర్షం కురవడంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా నీరు ప్రవహిస్తుంది. కొత్తగడి సమీపంలోని పెద్దవాగు మదుగుల చిట్టెంపల్లి సమీపంలోని వాగు ఆలంపల్లి నుండి గిరి గట్ పల్లి కి వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరద నీరు భారీగా ప్రవహిస్తుంది.

పులమద్ది వెళ్లే మార్గంలో వరద నీటితో అండర్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయం అయింది. కొత్తగడి నుండి కొంపల్లి వెళ్లే మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జి నిర్మాణంలో నీళ్లు ఉండడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి

శుక్రవారం ఉదయం 9 గంటలకు సైతం రోడ్లపై జన సంచారం లేకుండా కనిపించాయి. మొత్తం మీద ఈ భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలు ఇచ్చిన నేపథ్యంలో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement