Monday, November 25, 2024

ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద-గేట్లు ఎత్తివేసే అవకాశం

నిజాంబాద్ జిల్లా ప్రాంతంలో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఏ క్షణానైనా గోదావరి లోనికి గేట్లు ఎత్తివేసి నీటిని వదిలే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1090 అడుగులు నీటి సామర్థ్యం ఉంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నదిలోనికి వెళ్ల రాదని అధికారులు ప్రకటించారు.

గోదావరి నది పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేట కూడా వెళ్లకూడదని అధికారులు ముందస్తు సూచనలు చేశారు. గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం అధికారులను అప్రమత్తం చేశారు. పోలీస్ రెవెన్యూ అధికారులను అప్రమత్తం నుండి ప్రజలకు రాబోయే ముప్పు గురించి ముందస్తు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement