Sunday, November 24, 2024

Flood Flow – భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – భద్రాచలం టౌన్ – భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది.. నేటి ఉదయం 9 గంటల సమయంలో 51.16 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. గత రాత్రి నుంచి స్వల్పంగానే గోదావరి పెరుగుతున్నప్పటికీ మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే స్థాయికి వస్తుందని అధికారులు చెప్తున్నారు.

ఇప్పటికే భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే రహదారిపై నీళ్లు వచ్చాయి. అదే విధంగా గత మూడు రోజుల నుంచి విలీన మండలాలకు వెళ్లే రోడ్ల మీదకి నీళ్లు రావడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అదే విధంగా విలీన మండలాల్లో అనేక గ్రామాల చుట్టూ గోదావరి చేరుకుంది.

- Advertisement -

అయితే ఎగువ నుంచి మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి వరద తీవ్రత కొంత తగ్గిందని సమాచారం. ఈ నేపథ్యంలో గోదావరి మరో రెండు అడుగులు పెరిగి తగ్గవచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే నిన్నటి వరకు గోదావరి దిగువన వున్న శబరి నది భారీగా పెరిగి మళ్ళీ తగ్గి గత రాత్రి నుంచి మళ్లీ పెరుగుతుంది. శబరి పెరిగితే గోదావరికి ప్రమాదకరంగా వుంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement