హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది..దాంతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,426 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,253 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 641.10 అడుగులు. మూసీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 3.47 టీఎంసీలుగా ఉంది.నిన్న కూడా ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తారు. ఒక్కో గేటును ఫీటు మేర ఎత్తి 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి మొదలైన వర్షం శుక్రవారం రాత్రి వరకు వదలకుండా కురిసింది.
మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం-మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
Advertisement
తాజా వార్తలు
Advertisement