Thursday, September 12, 2024

Flood – నిండు కుండ …. బాసర గోదావరి…

బాసర అగస్టు 2( ప్రభ న్యూస్) ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో బాసర వద్ద గోదావరి నది నిండికుండలా మారింది. ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడుతుండడం,తెలంగాణ లో అల్పపీడనద్రోనితో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో గోదావరి నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. వర్షాకాలంలో వర్షాలు అంతంత మాత్రాంగానే కురియడంతో నదిలో నీరు అంతగా చేరలేదు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు లక్ష క్యూసెక్కులతో గోదావరిలోకి వచ్చి చేరుతుంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం సోమవారం ఉదయం బాసర గోదావరి నది ప్రవాహాన్ని తాసిల్దార్ పవనచంద్ర ,ఎస్సై గణేష్, ఎంపీడీవో అశోక్ పరిశీలించారు. నదిలోకి స్నానాలకు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement