బోడుప్పల్, ప్రభన్యూస్: బోడుప్పల్‌లో ఆదివారం జరుగనున్న బోనాల ఉత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీలు అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చిచ్చురేపింది.మేయర్ దళితులను అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. తమ పార్టీ తరపున ఏర్పాటుచేసుకున్న హోర్డింగ్ ప్లెక్సీని అక్ర మంగా తొలగించి మేయర్ సామల బుచ్చిరెడ్డి తన ప్లెక్సీని ఏర్పాటుచేసుకోవడాన్ని ఆగ్రహించిన కాంగ్రెస్‌యువనేత రాపోలు ఉపేందర్ తమ పార్టీనేతలతో కలసి మేడిపల్లి సిఐ గోవర్ధనగిరికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చానీయాంశంగా మారింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ యువనేత రాపోలు ఉపేందర్ మాట్లాడుతూ.
బోడుప్పల్ లోని అంబేద్కర్ చౌరస్తా దగ్గరలోని కొండల్‌రెడ్డి బిల్డింగ్‌కు ఉన్న హోర్డింగ్‌కు తన పుట్టినరోజు సందర్బంగా బుధవారం రోజున ప్లెక్సీ ని ఏర్పాటు చేశానన్నారు.అయితే అదే రోజు రాత్రి తాను ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించి మేయర్ సామల బుచ్చిరెడ్డి,అతని తనయుడు సామల మనోహర్‌రెడ్డిలఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని వాపోయారు.తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వాడిననే అక్కసుతో అధి కారమదంతో అన్ని రకాల అనుమతులతో ఏర్పాటు చేసుకున్న తన ఫ్లెక్సీని కావాలనే తొలగించాలని రాపోలు ఉపేందర్ ఆరోపించారు.తనకు జరిగిన అవమానంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఉపేందర్ డిమాండ్ చేశారు.