అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – సంకిశాలలో నిర్మాణంలో ఉన్న సేఫ్టే వాల్ కూలిన ఘటనలో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.. ఈ ఘటనకు భాధ్యులైన వారిపై సస్పెండ్ వేటు వేసింది..ఇక ప్రాజెక్ట్ డైరెక్టర్ పై బదిలీ వేటు వేసింది.. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఉత్వర్వులు జారీ చేశారు.. ఇది ఇలా ఉండగా ప్రమాదంపై దర్యాప్తు కోసం లమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. నేడు ఆ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించింది.. విధులలో ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ప్రమాదం జరిగిందని నివేదిక తేల్చింది.. దీంతో ప్రాజెక్టు డైరెక్టరు సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. ఆయననునాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేశారు.. ఇక ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ – 3 (సుంకిశాల) సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ లు సస్పెండ్ చేసింది.. అలాగే నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు దానం కిషోర్.
Flash News – సుంకిశాల ఘటనలో సిజిఎం, జిఎంతో సహా పలువురు సస్పెండ్ …
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement