Monday, November 18, 2024

Flash News – పెద వాగు ప్రాజెక్టు కాలువకు గండి – భయం గుప్పిట్లో 12 గ్రామాల ప్రజలు

అశ్వారావుపేట, జూలై18( ప్రభ న్యూస్): గడచిన 48 గంటలుగా మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గుమ్మడివల్లి గ్రామంలోని పెదవాగు ప్రాజెక్టు కాలువకు గండి పడింది. ప్రాజెక్టు సామర్థ్యం 45 వేల క్యూసెక్కులు కాగా భారీ వర్షాలకు సుమారుగా 70 వేల క్యూసెక్కుల వరకు వరద నీరు ప్రాజెక్టుకు చేరుకోవడంతో ప్రాజెక్టు నుంచి ఖమ్మంపాడు వైపుగా వెళ్లే కాలువకు గండి పడింది.

దీంతో వరద నీరు దిగువ ప్రాంతానికి రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న 12 గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా ప్రాజెక్టు పైనుంచి వరద నీరు పొంగి పొర్లటంతో వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరగా ఇప్పుడు గండి కూడా పడటంతో ఏ నిమిషం ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన పడుతున్నారు.

- Advertisement -

వర్షాలు ఇలాగే మరో ఒకటి రెండు రోజులు కొనసాగితే ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు .ఇదే జరిగితే పెనుముప్పు సంభవించే అవకాశం ఉందని భయ పడుతున్నారు..

ఇన్ఫ్లో భారీగా పెరగడంతో ఆనుకట్ట కు గండిపడింది. మధ్య తరహా నీటి ప్రాజెక్టు అయిన పెద్దవాగు కట్టతెగడంతో దిగువనున్న మూడు గ్రామాలు పూర్తిగా మునకకు గురై కొట్టుకుపోయే అవకాశం ఉందని బయపడుతున్నారు

.

కాగా, వాగు ఉదృతి పెరగడం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనుంది.. ఇక్కడ ఎపి,తెలంగాణ అధికారులు సమన్వయం తో పని చేస్తూ పరిస్థితిని గమనిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement