Monday, November 18, 2024

Politics: కాంగ్రెస్​లో ఆగ్రహ జ్వాల.. ‘రెడ్ల చేతిలో అధికారం’పై సీనియర్ల సీరియస్​!

ఏఐసీసీ తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్​ పార్టీ చింతన్​ శిబిర్​ నిర్వహించాలని ప్లాన్​ చేసింది. జూన్​ 1, 2 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ నిర్మాణం, కార్యాచరణ, దిద్దుబాటు చర్యలపై పూర్తిస్థాయిలో సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి ఈ మధ్య చేసిన రెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీ లీడర్లలో ఆగ్రహం తెప్పించాయి. ప్రస్తుతం రేవంత్​రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఈ సమావేశాలు నిర్వహిద్దామని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది లీడర్లు మాత్రం అట్లాంటిదేం అవసరం లేదు. రేవంత్​ లేకున్నా సమావేశాలు జరగాల్సిందే అని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే.. సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనున్నట్టు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్యం ఠాగూర్​ కూడా హాజరు అవుతారని సమాచారం. ఈ సమావేశాల్లో రేవంత్​ తీరుపై, ప్రధానంగా ఆయన రెడ్ల చేతుల్లోనే అధికారం ఉండాలన్న స్టేట్​మెంట్​పై సీరియస్​గానే చర్చ జరిగే అవకాశం ఉంది. రేవంత్​రెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసే అవకాశాలున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement